Pinarayi Vijayan: తగిన గుణపాఠం చెప్పారు.. కర్ణాటక ఎన్నికలపై కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Chief Minister Pinarayi Vijayan: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పాలన లేదని, కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో 10 రోజుల పాటు ప్రచారం చేసి అరడజను రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత తహతహలాడిందో దీన్నిబట్టి తెలుస్తోంది. ప్రజలు కూడా ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు.’ అని పినరయి విజయన్ అన్నారు.
Read Also: Bandi Sanjay : హిందుత్వం లేకుండా భారతదేశం లేదు
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
భారత ఎన్నికల సంఘం ప్రకారం.. కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో 66 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) 19 స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ గతం నుంచి నేర్చుకోవాలి. బీజేపీ ప్రతిపక్షంలో ఉండి సంతృప్తి చెందదు. ఎన్నికల్లో ఓడిపోయినా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నానికి మద్దతిచ్చారని.. మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ అధినాయకత్వం జాగ్రత్త వహించాలని కేరళ సీఎం సూచించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే భావన దేశంలో నెలకొందని అన్నారు. పార్లమెంట్‌లో సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని పాలించినప్పుడు కాంగ్రెస్ గతంలో ఉండేది కాదని ప్రస్తావిస్తూ.. ‘‘దేశాన్ని కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఒంటరిగా పాలించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవు. బీజేపీని అధికారం నుంచి దింపడమే లక్ష్యం.. అందులో కాంగ్రెస్ కూడా పాలుపంచుకోవాలి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి తీరని లోటు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!