VC. Sajjanar: నేటితో మహాలక్ష్మి పథకానికి మూడు వందల రోజులు పూర్తయ్యాయని.. 90 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను సజ్జనార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. చారిత్రాత్మక ప్రాంతం కరీంనగర్ జిల్లాలో పర్యావరణ హితమైన బస్ లని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. డిసెంబర్ 9 న మహాలక్ష్మి పథకం ప్రారంభం అయిందని గుర్తు చేశారు. ఈరోజు తో మహాలక్ష్మి పథకం మూడు వందల రోజులకి చేరిందన్నారు. ఇప్పటి వరకు 90 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్ లానే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్ లని ప్రారంభిస్తామన్నారు. అనంతరం బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్, వీసీ సజ్జనార్ ప్రయాణించారు. బస్సు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు వున్నాయా అంటూ స్వయంగా మహిళలను అడిగి తెలుసుకున్నారు.
Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..