Posters in Jagtial: ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. జగిత్యాలలో పోస్టర్ల కలకలం..
- మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్ల కలకలం..
- జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో వెలసిన పోస్టర్లు..
- ప్రజ మంచికోరే సంస్థ పేరిట వెలసిన పోస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posters in Jagtial: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. చ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. ఎప్పుడు ఎవరు ఎలా చస్తారో మాకే తెలవదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. రెడ్ పెన్నుతో ఈ విషయాన్ని అందులో రాసుకొచ్చారు. దీంతో స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యా్ప్తు చేస్తున్నారు. స్థానికులు భాయందోళన చెందడంతో పోలీసులు ఈ పోస్టర్లను అక్కడి నుంచి తొలగించారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Read also: Group-1 Prelims: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
ఇట్లు.. ప్రజల మంచి కోరే సంస్థ పోస్టర్..
గ్రామ మంత్ర గాళ్ల తస్మాత్ జాగ్రత్త… మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్ర గాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం. ఆ పని గచ్చు నూతి దగ్గర ఉన్న ఇద్దరి మంత్ర గాల్ల తో మొదలు పెడతాము ఆ తరువాత గుండ్ల వాడ కట్టు, గోలొల వాడ కట్టు, గౌండ్లోల్లు, పాల కేంద్రం చుట్టూ పక్కల మరియు మాల మాదిగల వాడ కట్టులో వున్న మంత్రగాళ్లు అందరినీ చంపుతం.. ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారో మాకే తెలియదు.గ్రామ ప్రజలకు మనవి ఇప్పటి వరకు మీరు చూస్తూ ఎలా వున్నారో అలాగే వుండండి అలా కాకుండా మంత్ర గాళ్ళకు సపోర్ట్ చేశారో మీకు కూడా ప్రాణపాయం వుండొచ్చు అనేక మంది అనేక బాధలు పడుతూనే వున్నారు ఈ మంత్ర గాల్లా వల్ల అంటూ వాల్ పోస్టర్ వెలిసింది. ఇది ఇలా ఉంటే.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఓ 8 మంది మంత్రాగాళ్లను హెచ్చరిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆవార్త సంచలనంగా మారింది. ఇప్పుడు మళ్లీ మంత్రగాళ్లను హెచ్చరిస్తూ పోస్టర్లు వ్యవహారం బయటకు రావడంతో పోలీసులకు సవాల్ గా మారింది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!