Karimnagar Manasa Devi Temple: 800 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాశింపేట గ్రామంలో స్వయంభూ మానస దేవి మహా క్షేత్రం వెలిసింది. ఈ ఆలయం భారతదేశంలో రెండవ శ్వయంభు దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మొదటిది హరిద్వార్‌లో ఉండగా, రెండవది మానస దేవి ఆలయం కాశింపేట గ్రామంలో కొలువై ఉంది. మానసా దేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనసారా భక్తుల కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు. పూర్వం ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉండేది. విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారని, వీరభద్ర స్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు 108 నాగ విగ్రహాలు, నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండటం విశేషం. సర్పదోషం వున్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
Kishan Reddy: హైదరాబాద్ లో ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా..