ప్రజల స్పందన, బిజెపి కు ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కే.సి.ఆర్ “దళితబంధు”పథకాన్ని తీసుకు వచ్చారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం దళితుల మీద “ఫేక్ ప్రేమ” చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. “ఫేక్ ఐడి” కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారు. కోట్ల…
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని త్రీటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్ మున్సిఫ్ కోర్టు.. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా… ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు మున్సిఫ్ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు ఇచ్చారు. కాగా,…
ఉద్యోగాలు ఇస్తా అని కౌశిక్ రెడ్డి మోసం చేశాడు అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఆడియో టేపుతో అడ్డంగా దొరికిన దొంగ కౌశిక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలను ఎందుకు తిట్టలేదు. కౌశిక్ రెడ్డి ఓ దొంగ… నువ్వు రేవంత్ కాలి గోటికి సరిపోవు అని తెలిపారు. 2018 ఎన్నికల్లో నువ్వెన్ని కోట్లు తెచుకున్నావ్. డబ్బులు ఇస్తేనే పీసీసీ వస్తది…
కరీంనగర్ జిల్లాలో బాయిలర్ కోళ్లు వింత వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఎదిగిన కోళ్లు విక్రయించే సమయంలో వేలల్లో చనిపోవడంతో పౌల్ట్రీ ఫారం యజమానులు తీవ్రంగా నష్టపో తున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వింత వ్యాధులు నుండి కోళ్లను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉపాధిగా వందల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఏర్పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. అయితే వింత రోగాలతో వేలాది కోళ్లు మృతి…
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామంలోని ఇటీవల టీఆరెస్ నాయకుల దాడి ఘటనలో గాయపడ్డ దళిత కూలీ బొడ్డు భూమయ్యను పరామర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు. దళితులపై, సమాన్యులపై దాడులు చేయడానికి టీఆర్ఎస్ లీడర్లకి ప్రభుత్వం లైసెన్స్ లు ఇచ్చింది అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులు జరిగిన ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం లో దళితులపై దాడులు ఆనవాయితీగా మారాయి.. తెలంగాణ…
కరీంనగర్ జిల్లా అంటే సిఎం కేసీఆర్ కు ఎంతో మక్కువ అని.. ఈ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 14 కిలోమీటర్లు పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశామని..ఇప్పటికే ఐటి టవర్ ప్రారంభం కావడం అక్కడ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ ఇండియాలో మెదటిసారి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడిందని..గండిపేట చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరగా పనులు జరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్,…
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారుమాజీ ఎంపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాము. కరోనా నేపథ్యంలో అభివృద్ధి పనులు కొంత లేట్ అయినా మరలా పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకూ 196 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరో 200 కోట్లు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ద్వారా కరీంనగర్…