ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్,…
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో జోరగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌లోని హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, శంకరపట్నం, సైదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెలపిలేని వర్షం కురుస్తోంది. కామారెడ్డిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.…
కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారుమాజీ ఎంపీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాము. కరోనా నేపథ్యంలో అభివృద్ధి పనులు కొంత లేట్ అయినా మరలా పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకూ 196 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరో 200 కోట్లు అభివృద్ధి పనులకు నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ద్వారా కరీంనగర్…
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆరు ప్రవేటు హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించని ప్రవేటు హాస్పిటల్స్ లైసెన్సు లు 15 రోజుల పాటు రద్దు చేసింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జూవెరియా. ప్రవేటు హాస్పిటల్స్ లో విజిలెన్స్ కమిటి తనిఖీ చేసి నెల రోజులు లోగా సమాధానం ఇవ్వాలని షోకాస్ నోటీసులు చేసిన స్పందించని ఆరు హస్పిటల్స్ కు లైసెన్స్ లు…
దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుం బిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కార్యాలయం యందు రైతులందరికీ, హమాలీ, చాట, సడెం, దడువాయి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే…
వివిధ కేసుల్లో సుమారు 40 కి పైగా నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ కాగా వాటినుండి తప్పించుకొనుటకు 15 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న, ఒక ఘరానా మోసగాడిని వెంటాడి , వేటాడి కటకటాల పాలు చేసిన కరీంనగర్ పోలీసులు !! ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విలన్, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడిన తర్వాత, ఆ జీవితంతో తృప్తి పడక, అధికంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు కావాలనే దురాశతో,…
కరీంనగర్ సీవీఎం ప్రైవేటు హాస్పిటల్ నిర్వకంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీవీఎం హాస్పిటల్ లో వెంటిలేటర్ సరిగా లేక రోగి మరణించాడు. అయితే చనిపోయిన విషయం చెప్పకుండా.. ఫైనల్ బిల్లు చెల్లించాలని కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేసారు హాస్పిటల్ సిబ్బంది. ఈ ఘటన పై ఎన్టీవీ చూపిన కథనాలపై స్పందించిన హెచ్చార్సీ… కలెక్టర్, DMHO కు నోటీసులు పంపింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్…
మా ప్రాంతానికి ఇంఛార్జ్ గా వస్తున్న వాళ్ళు ఇక్కడి ప్రజాప్రతినిధులు గెలుపులో ఏమన్నా సాయం చేశారా అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మాకు సహకరించకపోతే ఊరుకునేది లేదు అంటారా..సర్పంచ్ లకు ఎంపిటిసి లకు నిధులు రావు మీ గ్రామాలు అభివృద్ధి కావు అంటూ బెదిరిస్తున్నారు. మంత్రి కాక ముందు సంస్కారం లేకపోతే మంత్రి అయ్యాక అయినా సంస్కారం నేర్చుకోవాలి. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళని చూసుకోవాలి తప్ప హుజురాబాద్ పై కక్ష…
తెలంగాణలో కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తులను ఇంటి యజమానులు అనుమానంతో చూస్తున్నారు. తాజాగా, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అంబేద్కర్ నగర్ లో నివశించే ఓ మహిళకు కరోనా సోకింది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే సదరు మహిళను ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ మహిళ స్థానిక కూరగాయల మార్కెట్లోనే ఉండిపోయింది. అయితే, మరుసటి రోజున ఆ మహిళను మార్కెట్ నుంచి పంపించేశారు. దిక్కుతోచని స్థితిలో మహిళ సులబ్ కాంప్లెక్ వద్ద…