ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్‌కు కొత్త పాఠాలు నేర్పిందా? ప్రజల సమస్యలతోపాటు.. సొంత పార్టీలోని సమస్యలు బోధపడ్డాయా? బీజేపీ కోసం పనిచేసే వారు ఎవరు? శల్య సారథ్యం చేస్తోంది ఎవరో గుర్తించారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందట..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ముగిసిన తర్వాత పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తిగా మారింది. ఈ…
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరగుతోంది. ఓ వైపు ప్రచార హోరు ..మరోవైపు నామినేషన్ల పర్వం. నామినేషన్ల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. కొంత కాలంగా ఆమె తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో…
తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు…
హుజూరాబాద్ సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా…
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ప్రచార వేగం పెరింది. దాంతో పాటే హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. టీఆర్‌ఎస్ ప్రచార బృందానిక సారధ్యం వహిస్తున్న మంత్రి టి. హరీష్ రావు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏకరవు పెడుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధనాలను ఎండగడుతున్నారు. అంతేకాదు సరికొత్త హామీలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ…
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టే తిరుగుతోంది. సహజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ బైపోల్ నిర్వహణలో ఈవీఎంలను ఉపయోగిస్తారా? లేదంటే బ్యాలెట్ పద్దతా అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ..తమ డిమాండ్లు హైలైట్ అయ్యేలా వివిద వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పోటీ చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు,…
దళిత బంధు పై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాము. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం…
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు ముఠా యత్నంచింది. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ,…
సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు…
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… నన్ను చూస్తే గజగజ వణుకుతున్నారు. నా సభలకు కరెంట్ కట్ చేస్తున్నారు. అదే నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా అని తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక వస్తేనే దళితుల మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలి. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి.. తొడ గొట్టి మాట్లాడతారా. మీ కాలేజీల్లో విద్యార్థులకు…