కరీంనగర్ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలో బాయిలర్ కోళ్లు వింత వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఎదిగిన కోళ్లు విక్రయించే సమయంలో వేలల్లో చనిపోవడంతో పౌల్ట్రీ ఫారం యజమానులు తీవ్రంగా నష్టపో తున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వింత వ్యాధులు నుండి కోళ్లను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉపాధిగా వందల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఏర్పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. అయితే వింత రోగాలతో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో పెంపకందార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కోడి పిల్ల ధర 25 రూపాయలులు ఉండగా కిలో కోడికి 112 రూపాయలు ధర ఉంది. రెండు కిలోల బరువు పెరగాలంటే 45 రోజులు కోళ్లకు దాన ఇవ్వాల్సి ఉంటుంది.
read also : నేడు షర్మిల రాజకీయ పార్టీ అధికారిక ప్రకటన
Also Read
ఇక ఒక కోడి నాలుగు కిలోలు దాన తింటూ ఉండగా కిలో దానా ముప్పై మూడు రూపాయల చొప్పున 132 రూపాయలు అవుతుంది. మందులుకి పది రూపాయలు మరో పది రూపాయలు నిర్వహణ ఖర్చు అవుతుంది. కోడి పిల్ల ధర 25 రూపాయలు ఉండగా మొత్తం ఖర్చు 175 రూపాయలు అవుతుంది..రెండు కిలోల కోడి రెండు వందల ఇరవై నాలుగు రూపాయల ఉండటంతో కొంత గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా తరుణంలో అకారణంగా కోళ్లు చనిపోతుండటంతో పెంపకందారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
గడిచిన నాలుగు నెలలుగా 80శాతం కోళ్లు.. వింత వ్యాధులతో మృతి చెందాయి.దీంతో ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో కోళ్లఫారాలు యజమానులు ఆవేదన చెందుతున్నారు.. చనిపోయిన కోళ్లను ప్రత్యేక స్థలాల్లో గుంతలు తవ్వి పూడ్చి పెడుతున్నారు. గతంలో కరోనా సమయంలో భారీగా నష్టం వాటిల్లగా మరోసారి వింత వ్యాధులు కోళ్ల ఫారాలపై ఎఫెక్ట్ పడింది.45 రోజులు పెంచిన తర్వాత కోళ్లు అమ్మే టైంలో మృత్యువాత పడుతున్న సమయంలో పౌల్ట్రీ పరిశ్రమ కరీంనగర్ జిల్లాలో కుదేల వుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ధర ఉన్న కోళ్లు మృత్యువాత పడటంతో వేలాదిగా చనిపోతుం డటంతో కోళ్ల ఫారాలు బంద్ చేసుకుంటామంటున్నారు పౌల్ట్రీ ఫారం యజమానులు.
- Tags
- chiken
- karimnagar
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!