హుజురాబాద్ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమీషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదు. హుజురాబాద్ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల మాట్లాడటం లేదు. నీ సమస్య నీబాధ నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతావ అని ప్రశ్నించారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ సంజయ్ ఎం మాట్లాడటం లేదు. సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్…
ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అందులో కులమే కీలకం. అభ్యర్థి ఎంపిక మొదలు గెలుపు వరకు కులందే ప్రధాన భూమిక. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది కుల రాజకీయం. కులాల మీద మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కుల రాజకీయం ఓ రేంజ్‌లో నడుస్తోంది. కులం ఓట్లను పక్కా చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. కులం ఓట్ల కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు.…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ రోజు ప్రచారంలో భాగంగా బీజేపీ,టీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఒకరినొకరు మాటలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాటే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దసరా సంబరాలు ముగిశాయి. కానీ హుజూరాబాద్‌లో ఇంకా ముగిసినట్టు లేదు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం దసరాలాగే ఉంది. మరో…
కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. దసరా చివరి రోజు కారణంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో 23 కోట్ల 20 లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దసరా ఫెస్టివల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గంలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం అమ్మకాలు 53 శాతం పెరిగనట్టు అధికారులు చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద విపరీతమైన…
ఈనెల 30 వ తేదీన జగరబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు మరింత ఎక్కువగా ఉన్నది. 1900 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లూకోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ పరిధిలోని…
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి నేడు ఈటల ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట. నామీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీలిస్తున్నారు. దళితబంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ మీపై ప్రేమతో…
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్ వాచ్..! ఎడముఖం పెడముఖంగా కౌశిక్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..? హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్…