Bear Roaming Roads: కరీంనగర్ లో ఎలుగుబండి హల్ చల్ చేసింది. రాత్రి ఎలుగుబండి రోడ్డుమీదకు పరుగులు పెట్టింది. దీంతో నగర ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు.
Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయరు మానేరు డ్యాం నుంచి కాకతీయ ద్వారా దిగువకు నీటిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విడుదల చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల (గన్నెరువరం)లో 60 విద్యార్ధులకు కండ్ల కలకలతో ఇబ్బందులు పడుతున్న.. వారికి చికిత్స చేసేందుకు వైద్యాధికారులు రాలేదు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బూపల్లి స్పందనను చూడడానికి వచ్చిన తండ్రి బూపల్లి విజయ్ కు గుండె పోటు రావడంతో హాస్పిటల్ తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండె నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు ట్రై చేశారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో చనిపోయాడు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగిస్తూ ఇటీవల అగ్రనాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఆయనను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక చెప్పిన మాటలు ప్రస్తుతం నిజం అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నగరం రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. రాష్ట్రంలో రెండవ నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది అని మంత్రి గంగులా అన్నారు.