వరకట్నం విషయంలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు మనుషులు మాత్రం మారడం లేదు. కొందరు పెళ్లి తరువాత అదనపు కట్నం కోసం తమ భార్యలను వేధిస్తుంటారు.. మరికొందరు పీఠల మీద పెళ్లికి నిరాకరించి.. అమ్మాయి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తారు. కట్నం ఇస్తే గానీ మూడు ముళ్లు వేయమంటూ మారాం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వెలుగు చూసింది. అది కూడా ఎమ్మెల్యే ముందే జరిగడం షాక్‌కు గురి చేసింది.
Also Read : Yashasvi Jaiswal: నా ఎదుగుదలకు వారే కారణం.. సీక్రెట్ చెప్పేసిన జైస్వాల్
శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ – మల్లయ్య కూతురు అనూష పెళ్లి సైదాపూర్ లోని వెన్నెంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో ఇటీవల కుదిరింది. కట్నం కింద 5 లక్షల రూపాయలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పు చేసి పెళ్ళికి ముందే కట్నం డబ్బులు ముట్టజెప్పారు. ఇవాళ కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉండడంతో ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే రసమయి వెళ్లారు. పెళ్లి బాజా మొగాల్సిన పచ్చని పందిట్లో వధువు వరుడి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. దీంతో నాకు బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడుతాను లేకపోతే వెళ్ళిపోతాను అంటూ పెళ్లి కొడుకు చెప్పడంతో పెళ్ళి కూతురు కుటుంబ సభ్యులంతా కన్నీరు పెట్టుకున్నారు.
Also Read : Hyderabad : సోమాజిగూడ.. ఆ విషయంలో దేశంలోనే నెంబర్. 2
ఈ సంఘటనను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. తాను బైక్‌ను కొనిస్తాని హామీ ఇవ్వడంతో దానికి అవసరమైన లక్ష రూపాయల నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన వినయ్.. అనూష మేడలో తాళి కట్టారు. రసమయి బాలకిషన్ స్వయంగా దగ్గరుండి పెళ్లి పనులు అన్ని చూసుకున్నారు. తోబుట్టువు లాంటి చెల్లెలి పెళ్ళికి కట్నంగా బైక్ కొనిచ్చి తన మంచి మనస్సును చాటుకున్నారు. రసమయి చేసిన సహాయంతో ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.