Karimnagar : కరీంనగర్ లో విషాదం.. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఆత్మహత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని నెలల కింద ఆ ఇంటి కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోవడం తట్టుకోలేక భర్త మనస్థాపంతో మూడు రోజుల కింద తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు కోడలు అర్ధాంతరంగా తనువు ముగించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మనో వేదనతో తల్లిడిల్లి చనిపోయింది. ఈ హృదయ విధారక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Read Also:Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌కి హుస్నాబాద్ కు చెందిన శారదతో గతేడాది మే 15న పెళ్లైంది. కానీ పలు కారణాల వల్ల ఎనిమిది నెలల క్రితం భార్య శారద తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. శ్యాంసుందర్‌కి 65 ఏళ్ల తల్లి బొల్లంపల్లి కనకలక్ష్మి, తండ్రి కనకయ్యతో పాటు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. భార్య చనిపోవడంతో శ్యాంసుందర్ మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో దాని కంటే ఒక రోజు ముందు అంటే మే 14వ తేదీన భార్య ఆత్మహత్య కు పాల్పడిన చోటే అతడూ సూసైడ్ చేసుకున్నాడు.
Read Also:CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అతడి మృతి పట్ల తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుమారుడు కళ్లముందే విగత జీవిగా కనిపించడాన్ని తట్టుకోలేకపోయింది. సోమవారం సొంత ఊరికి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం సోమవారం రాత్రి సమయంలో తల్లి కనకలక్ష్మికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మరణించింది. కొంత కాలం వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఊరిలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!