ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అనే ఒకపాట ఉలవచారు బిర్యాని సినిమాలో మనం వినే ఉంటాం. ఈ మాటను కొందరు నిజం చేస్తుంటారు. అయితే, కొంతమంది బిర్యానీలో ముక్కలు రాలేదని గొడవ పడటం మనం చూసే ఉంటాం.. కానీ తాజాగా, కరీంనగర్ లో చికెన్ బిర్యానీలో వచ్చిన బొక్కలు గట్టిగా ఉన్నాయని హోటల్ యాజమాన్యంతో ఓ యువకుడు గొడవకు దిగాడు.
Read Also: Chandrayaan-3 Mission: చందమామకు చేరువగా చంద్రయాన్-3
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బిర్యానీ పంచాయతీ ఎకంగా పోలీస్ స్టేషన్ కు చేరింది. రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో చికెన్ బిర్యాని కొనుగోలు చేసిన వినియోగ దారుడికి వచ్చిన బొక్కలు బ్రేక్ కావడం లేదు, ఇవి చికెన్ బొక్కలు కావంటూ హోటల్ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగాడు. బిర్యాని బొక్కలు స్వాధీనం చేసుకుని పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫుడ్ ఇన్స్ స్పెక్టర్ కు పోలీసులు సమాచారం అందించారు.
Read Also: Bhola Shankar Censor: భోళా శంకర్ సెన్సార్ రివ్యూ.. సభ్యులు ఏమేం సూచనలు చేశారంటే?
ఇక, రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్స్ స్పెక్టర్ రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో తనిఖీలు చేశాడు. బిర్యానీ లెగ్ పీస్, అయిల్, ఇతర సామాగ్రి శాంపిళ్లను సేకరించాడు. సాంపిళ్లను ల్యాబ్ కు తరలించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్న ఫుడ్ సెఫ్టీ అధికారిణి వెల్లడించారు. గతంలో సేకరించిన శాంపిళ్ల సంగతి ఏమిటని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. హోటల్ కు ఫైన్ వేశామని, వారు కట్టారని ఫుడ్ ఇన్ స్పెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం సేకరించిన శాంపిళ్లకు సంబంధించిన రిసివుడ్ కాపీని స్థానికులు అడిగారు. రిసివుడ్ కాపీ ఇవ్వకుండానే ఫుడ్ సెఫ్టీ అధికారులు వెల్లపోయారు.