పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బూపల్లి స్పందనను చూడడానికి వచ్చిన తండ్రి బూపల్లి విజయ్ కు గుండె పోటు రావడంతో హాస్పిటల్ తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండె నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు ట్రై చేశారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో చనిపోయాడు.
Read Also: Viral Video: పామును తిన్న తాబేలు.. నమ్మలేకపోతున్నారా ఈ వీడియో చూడండి..!
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన విజయ్, సుధీవన భార్యాభర్తలు.. అయితే వీరి కూతురు స్పందన పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. నిన్న రెండో శనివారం సెలవురోజు కావడంతో కూతురిని చూసేందుకు విజయ్ దంపతులు మల్లాపూర్ కు వెళ్లారు.. కూతురితో మాట్లాడుతుండగా విజయ్ కు ఒక్కసారిగా హార్డ్ ఎటాక్ వచ్చింది. దీంతో స్కూల్ సిబ్బంది సాయంతో అతడిని భార్య సుధీవన అంబులెన్స్ లో తరలించింది. అయితే రైలు వస్తుండటంతో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వేయడంతో అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది. ఆ అంబులెన్స్ అక్కడే దాదాపు 15నిమిషాల పాటు ఆగిపోవడంతో విజయ్ పరిస్థితి విషమించి మరణించాడు.
Read Also: Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. కంచం ఖాళీ చేస్తారు..
కొద్దిసేపట్లో హాస్పిటల్ కు వెళ్తారనగా రైలు గేటు పడటంతో విజయ్ కు టైంకి చికిత్స అందకపోవడంతో చనిపోయాడు.. రైల్వే గేటు పడకుండా ఉంటే విజయ్ బ్రతికేవాడని అక్కడున్నవారు తెలిపారు. హాస్పిటల్ కు చేరుకునేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో భార్య సుధీవన, కూతురు స్పందన కన్నీరుమున్నీరుగా విలపించారు. కూతురును చూసేందుకని వెళ్లినవాడు ఇలా విగతజీవిగా గ్రామానికి తిరిగిరావడంతో స్తంభంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తనకోసం వచ్చి చనిపోయావు నాన్న… అంటూ విజయ్ కూతురు స్పందన రోదించింది.