Building Collapse : కార్గిల్ జిల్లాలో శనివారం కొండ వాలుపై మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో దాదాపు 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.
జులై 26, 1999న పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్‌లో భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేసింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది.
Earthquake: దేశంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈ రోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
Kargil Night Landing: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గిల్ ప్రాంతంలోని ఎయిర్ స్ట్రిప్‌పై భారీ రవాణా విమానం C130-Jని రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి. యూఎస్ లాక్‌డీడ్ మార్టిన్ తయారు చేసిన C-130J సూపర్ హెర్క్యూలస్ విమానాన్ని సరుకులు, సైనికులు రవాణాతో పాటు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాడుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 24) నాటి తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో అతను కార్గిల్‌లోని సైనిక సిబ్బందితో కలిసి కనిపించాడు. అంతేకాకుండా.. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులను కాంగ్రెస్ ఎంపీ ప్రశంసించారు.
1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో ఇండియా పాక్ మధ్య లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదు. కానీ, పాక్ దీనిని పక్కన పెట్టి ముష్కరులను, సైనికులను కార్గిల్ నుంచి సరిహద్దులు దాటించి ఇండియాలోకి పంపంది. అప్రమత్తమైన ఇండియా వారిని ఎదుర్కొన్నది. గడ్డకట్టే చలిని సైతం…