1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో ఇండియా పాక్ మధ్య లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదు. కానీ, పాక్ దీనిని పక్కన పెట్టి ముష్కరులను, సైనికులను కార్గిల్ నుంచి సరిహద్దులు దాటించి ఇండియాలోకి పంపంది. అప్రమత్తమైన ఇండియా వారిని ఎదుర్కొన్నది. గడ్డకట్టే చలిని సైతం పక్కన పెట్టి, మన సైనికులు వీరోచితంగా పోరాటం చేశారు. మే 3 నుంచి జులై 26 వరకు యుద్ధం జరిగింది.
Read: వైరల్: జీవితం మలుపు తిప్పిన ఫోటోతో నటుడు ధర్మేంద్ర
ఈ యుద్ధంలో 542 మంది భారత సైనికులు మరణించగా, పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 4000 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందారు. పాక్ సైన్యం అక్రమంగా ఆక్రమించుకున్న సెక్టార్‌లను ఒక్కొక్కటిగా భారత్ తిరిగి సంపాదించుకుంది. భారత్ ఆపరేషన్ విజయ్ పేరుతో కార్గిల్ యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో విజయం సాదించడానికి గుర్తుగా ప్రతి ఏడాది జులై 26 వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటారు. మరణించిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటారు. ఈ యుద్దం తరువాత కూడా పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నది.