Kargil Night Landing: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గిల్ ప్రాంతంలోని ఎయిర్ స్ట్రిప్‌పై భారీ రవాణా విమానం C130-Jని రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి. యూఎస్ లాక్‌డీడ్ మార్టిన్ తయారు చేసిన C-130J సూపర్ హెర్క్యూలస్ విమానాన్ని సరుకులు, సైనికులు రవాణాతో పాటు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాడుతోంది. గరుడ్ కమాండోల శిక్షణలో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. వాయుసేన మొత్తం 12 C-130J విమానాలను వాడుతోంది. ఇవి హిండన్ లోని 77 స్క్వాడ్రన్, 87 స్క్వాడ్రన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇటు పాకిస్తాన్, అటు చైనా సరిహద్దుల్లో వేగవంతమైన సైనిక మోహరింపుకు ఇవే కీలకం.
ల్యాండింగ్ సమయంలో నైట్ విజన్ గాగుల్స్, ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ ఇమేజరీని ఉపయోగించడంతో నైట్ ల్యాండింగ్ సాధ్యమైంది. టెర్రైన్ మాస్కింగ్ అనే రాడార్ వ్యూహాన్ని కూడా ఉపయోగించారు. ట్రెర్రైన్ మాస్కింగ్ అనేది భూభాగం గుండా విమానాల కదలికలను దాచడానికి ఉపయోగించే ప్రక్రియ.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం.. షేక్ హసీనా విజయం లాంఛనమే..
ఎల్ఓసీకి అతి సమీపంలో..
కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ సుమారు 9,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నియంత్రణ రేఖకు దక్షిణంగా ఉంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలు శ్రీనగర్-లేహ్ హైవేకి ఎదురుగా వ్యూహాత్మక హైట్స్‌ని స్వాధీనం చేసుకున్నాయి. అప్పుడు జరిపిన దాడుల్లో ఈ ఎయిర్ స్ట్రీప్ దెబ్బతింది. పశ్చిమా ద్రాస్, తూర్పున బటాలిక్ మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఇది ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఏఎన్-32 మల్టీపర్పస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుతోంది. అయితే వీటికి నైట్ ల్యాండింగ్ సామర్థ్యం లేదు. చలికాలంలో కార్గిల్ నుంచి శ్రీనగర్, జమ్మూలకు ప్రజలను రవాణా చేసేందుకు వీటిని ఐఏఎఫ్ ఉపయోగిస్తోంది. తాజాగా C-130J హెర్క్యూలర్ విమానాన్ని రాత్రివేళలో ల్యాండ్ చేశారు.
1962 యుద్ధం సమయంలో, IAF యొక్క 43 స్క్వాడ్రన్ యొక్క An-12లు కార్గిల్, లేహ్, థోయిస్‌లలో పనిచేశాయి. 2001 పార్లమెంట్ దాడులు, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలను చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో 2002లో వెస్ట్రన్ ఎయిర్ కమాండర్, ఎయిర్ మార్షల్ వినోద్ భాటియా ప్రమావశాత్తు కార్గిల్ ఎయిర్ ఫీల్డ్ నుంచి పాకిస్తాన్ గగనతలంలోకి ఏఎన్-32 విమానాన్ని నడిపాడు. ఆ సమయంలో పాక్ సైనికులు భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణితో దాడి చేయడంతో లేహ్‌కి వెళ్లే విమానం దెబ్బతింది.
In a first, an IAF C-130 J aircraft recently carried out a night landing at the Kargil airstrip. Employing terrain masking enroute, the exercise also dovetailed a training mission of the Garuds.#SakshamSashaktAtmanirbhar pic.twitter.com/MNwLzaQDz7
— Indian Air Force (@IAF_MCC) January 7, 2024