కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని మ్యాటర్ నే కంగనా తన ట్వీట్ తో పాటూ పోస్ట్ చేసిందని ఆశిష్ ఆరోపిస్తున్నాడు. ఆయన తరుఫున అతడి లాయర్స్ కొన్నాళ్ల క్రితమే ముంబైలోని బ్యాండ్రా మెజిస్ట్రేట్ కోర్టులో కంగనాపై కేసు వేశారు…
Read Also: ధనుష్ సొంత విల్లా కోసం వెచ్చిస్తోంది ఎంతో తెలుసా!?
ఆశిష్ కౌల్ కేసుతో పాటూ మరో కేసు కూడా బ్యాండ్రా కోర్టులో ఉండటంతో కంగనా విదేశాలకు వెళ్లకుండా ఆగిపోవాల్సి వస్తోంది. అధికారులు ఆమెకు పాస్ పార్ట్ సంబంధమైన అనుమతులు ఇవ్వటం లేదు. దాంతో కంగనా బాంబే హై కోర్టును ఆశ్రయించింది. కింది కోర్టులో ఉన్న కేసుల్ని, వివిధ ఎఫ్ఐఆర్ లని కొట్టివేయాలని అభ్యర్థించింది.
కంగనా రనౌత్ కి హై కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించినా దాన్ని మేం వ్యతిరేకిస్తామంటున్నారు ఆశిష్ కౌల్ తరుఫు లాయర్లు. మరోవైపు, బాలీవుడ్ ‘తలైవి’ పోలీసుల ముందు విచారణకు హాజరు కాకపోవటంతోనే కేసులో పురోగతి లేదని కూడా ఆశిష్ కౌల్ ఆరోపిస్తున్నాడు. చూడాలి మరి, కాశ్మీర్ ను పరిపాలించిన మహారాణి దిడ్డా యుద్ధంలో రెండుసార్లు మహ్మద్ ఘజన్వీని ఓడించింది. ఆ పాత్రలో కనిపిస్తానని ప్రకటించిన కంగనా ఆదిలోనే కోర్టు కష్టాల్లో ఇరుక్కుపోయింది. ముందు ముందు న్యాయస్థానాలు ఎలాంటి తీర్పులు ఇస్తాయో! అలాగే, విదేశాలకు వెళ్లకుండా తంటాలు పడుతోన్న కంగనా చట్టపరమైన అడ్డంకులు ఎలా దాటుతుందో…