బాలీవుడ్ అంటే గాసిప్స్. ఆ గాసిప్స్ నిండా దాదాపు ఎఫైర్లే. అయితే, పెళ్లికాని ఇద్దరు యంగ్ సింగిల్ సెలబ్స్ ఎంతగా మింగిల్ అయినా మునిగేదేం లేదు. కానీ, ఓ పెళ్లైన పెద్దాయన మనసు కుమారిని చూసి మారిపోతే? పెద్ద పెంటే అవుతుంది! అదే జరిగింది అజయ్ దేవగణ్, కాజోల్ దేవగణ్ మధ్య…
కాస్త్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 22 ఏళ్లుగా మిష్టర్ అండ్ మిసెస్ దేవగణ్ తమ సంసారం చక్కగానే నెట్టుకొస్తున్నారు. వారి ఇద్దరి పిల్లులు న్యాసా, యుగ్ కూడా ఇప్పుడు టీనేజర్స్! అయితే, ఇంత దాకా వచ్చేలోపు ఓ సారి కంగనా అడ్డుపడిందంటారు కాజోల్ కి! ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై’ సినిమాలో దేవగణ్, రనౌత్ రొమాన్స్ చేశారు. అయితే, తెర మీది శృంగారం నిజ జీవితంలోకి కూడా వచ్చేసిందట. కంగనా మీద ఇష్టం పెంచుకున్న అజయ్ ఆమెను తన తరువాతి సినిమాల్లోనూ ప్రమోట్ చేయటం మొదలు పెట్టాడు.
read also : తాప్సీ మూవీలో ‘ద ఫ్యామిలీ మ్యాన్’ బ్యూటీ
మరి ఆయనగారి ‘ఆ వ్యవహారం’ ఆమెకు తెలియకుండా ఉంటుందా? కాజోల్ ఒక దశలో పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచీ బయటకు వెళ్లిపోతానని హెచ్చరించిందట! ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై’లో అజయ్ దేవగణ్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన కంగనా మళ్లీ వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సీనియర్ హీరో భార్యే వైపే మొగ్గు చూపాడు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలే ముఖ్యమనుకుని వెనక్కి తగ్గాడు. దాంతో కాజోల్ కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్లే ఆలోచన మానేసింది! కంగనా గురించి చెప్పేదేముంది… మన ‘క్వీన్’ ఫైర్ బ్రాండ్ గా మారి ప్రస్తుతం ‘తలైవి’గా బీ-టౌన్ లో తన సత్తా చాటుతోంది!