అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ విడాకుల విషయం అందరినీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. వారిద్దరి విడాకులపై స్పందిస్తూ కంగనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ విడాకులకు కారణం కులాంతర వివాహమేనా ? అంటూ అనుమానం వ్యక్తం చేసింది కంగనా. అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంలో కులాంతల వివాహం ముఖ్యపాత్ర పోషించిందని నాకు అనుమానంగా ఉంది.
Read Also : రోజుకి ఎన్ని సిగరెట్లు ?… రష్మికకు నెటిజన్ ప్రశ్న
కిరణ్ రావు హిందూ మతానికి చెందినది అయినప్పుడు అమీర్ ఖాన్ తన కొడుకును ఎందుకు హిందువుగా పెంచలేదు ? అంటూ ప్రశ్నించింది. అంతేకాదు కిరణ్ రావు వివాహం తరువాత ఇస్లామిక్ లోకి ఎందుకు మారిపోయింది ? ఆమె హిందూ మతాన్ని ఎందుకు కొనసాగించలేదు? వారి విడాకుల విషయంలో కులాంతర వివాహం కీలకపాత్ర పోషించిందని అన్పిస్తోంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కంగనా వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంపై నెటిజన్లు లవ్ జీహాద్ అంటూ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.