T20 World Cup: క్రికెట్‌లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో…
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు. Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్‌కు కొవిడ్ కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో…
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌పై సన్‌రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 3 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది. Matthew…
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్…
మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సన్‌రైజర్స్…
భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక, ఈ విజయంతో.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. స్వదేశంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.. ఇప్పటివరకు భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ సొంతగడ్డపై 15 సార్లు జట్టుకు విజయాలను అందించాడు.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ విజయం రోహిత్‌కు…
త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐపీఎల్ మెగా వేలం కూడా పూర్తయింది. అయితే సన్‌రైజర్స్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. ఈ మేరకు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా చెప్పేశాడు. కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్‌కు వస్తారని… ఆ…
క్రికెట్ చరిత్రలో టాప్ స్పిన్నర్లు ఎవరు అనే చర్చలో తప్పకుండ వచ్చే పేరు ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. అయితే టెస్ట్ క్రికెట్ లో 708 వికెట్లు తీసిన వార్న్ తాజాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో ఉన్న టాప్ 5 బ్యాటర్లు వీరే అంటూ ప్రకటించాడు. అయితే వార్న్ ప్రకటించిన జాబితాలో మొదటి స్థానంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను గత కొంత కాలంగా అన్ని రకాల బౌలర్లను ఎందుకుంటూ…