దాదాపు ఏడాది విరామం తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఈరోజు క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో ప్రారంభమైన టెస్ట్‌లో మైదానంలో అడుగుపెట్టాడు. తన పునరాగమన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేన్ అర్ధ సెంచరీ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేన్ మామ చివరిసారిగా 2024 డిసెంబర్ 12-17 మధ్య హామిల్టన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 353 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి…
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంటే అందరికీ సుపరిచితమే.. తన కూల్ నెస్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకున్నాడు. అయితే, ప్రస్తుతానికి కేన్ మామ.. క్రికెట్ మైదానంలో కాకుండా, మరో విధంగా అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో అతను ఆడటం లేదు.. అయితే ఐపీఎల్ ప్రేక్షకుల కోసం అతను తనదైన శైలిలో సంతోషపరుస్తున్నాడు.
భారతదేశం- న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2002, 2013లో టీమిండియా రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన రెండవ ఎడిషన్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. Also Read:Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని…
అద్భుత ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర భారత్‌తో జరిగే ఫైనల్ పోరులో ఎలా రాణిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఏ ఒకరు కుదురుకున్నా రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ICC Champions Trophy: లాహోర్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై 362/6 పరుగుల భారీ స్కోరు సాధించి రికార్డు సృష్టించింది. నేడు (2025 మార్చి 5)న జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెన్సేషన్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (49*) రాణించడంతో న్యూజిలాండ్ జట్టు అత్యధిక స్కోరును…
NZ vs SA Semifinal: ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర, సీనియర్ బ్యాట్స్మెన్ కేన్ విలయమ్సన్ లు సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరును నమోదు చేసింది. Read Also: ICC ODI Rankings:…
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్…
Costly Catch: దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. గడిచిన రెండు సీజన్లలో సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన టీం విజయం సాధించగా.. ప్రస్తుతం మూడో సీజన్ మొదలైంది. ఈ లీగల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రికెటర్లందరూ వారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే క్రికెట్ ఆడినందుకు ఆడవాళ్లకు అలాగే సిబ్బందికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు. కాకపోతే కొన్ని…
Kane Williamson: దక్షిణాఫ్రికా T20 లీగ్ (SA20)లో కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ప్రదర్శనతో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఈ లీగ్ లో తన ఆరంభ మ్యాచ్‌లోనే తన సత్తా చాటుతూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడిన తీరు జట్టు భారీ స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శుక్రవారం, జనవరి 10, 2025న జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్,…