Rohit Sharma: టీమిండియా కెప్టెన్ నయా రికార్డు.. మోర్గాన్, విలియమ్సన్ వెనక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక, ఈ విజయంతో.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. స్వదేశంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.. ఇప్పటివరకు భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ సొంతగడ్డపై 15 సార్లు జట్టుకు విజయాలను అందించాడు.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.. దీంతో.. 15 విజయాలతో తనతో మానంగా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ వెనక్కి నెట్టేశాడు రోహిత్ శర్మ.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు
Also Read
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
ఇక, సొంత గడ్డపై టీ20 కెప్టెన్‌గా భారత్‌కు విజయాలు అందించినవారిలో తర్వాత స్థానంలో 13 విజయవాలతో విరాట్ కోహ్లీ, 10 విక్టరీలతో ఎంఎస్ ధోనీ ఉన్నారు.. ఆ ఇద్దరు టీమిండియా మాజీ కెప్టెన్‌లను ఎప్పుడో దాటేశాడు రోహిత్ శర్మ.. ఇక, ఓవరాల్‌గా టీ20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం మరో విశేషం. టీమిండియాకు టీ-20ల్లో వరుసగా ఇది 11వ విజయం. కాగా, నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి.. రోహిత్ సేన ముందు 184 పరుగుల టార్గెట్‌ను పెట్టగా.. 17.1 ఓవర్లో కేవలం మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది భారత్.. దాంతో పాటు.. మరో మ్యాచ్ మిగిలిఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!