కంచర్ల భూపాల్‌రెడ్డి.. కంచర్ల కృష్ణారెడ్డి. టీఆర్ఎస్‌లో కంచర్ల బద్రర్స్‌గా ఫేమస్. వీరిలో భూపాల్‌రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోదరులిద్దరూ ప్రస్తుతం చర్చగా మారారు. వారి దూకుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవర పెడుతుందట. నకిరేకల్, మునుగొడు నియోజకవర్గాలను నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్టు చర్చ నడుస్తోంది. కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారట. దీంతో ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయట. కంచర్ల బ్రదర్స్ స్వస్థలం…