తమిళంలో జయకేతనం ఎగురవేసిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి అలరించాయి. అలాగే ఇక్కడ విజయాన్ని చవిచూసిన సినిమాలు అక్కడా సక్సెస్ ను సాధించాయి. అలా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన ‘సవాలే సమాలి’ ఆధారంగా తెలుగులో ఏయన్నార్ ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం తెరకెక్కింది. అంతకు ముందు 1955లో ఏయన్నార్ నటించిన ‘రోజులు మారాయి’ సినిమాలోలాగే ఇందులోనూ ఊరి పెదకామందుకు, హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. అదే కథకు ఓ…
(ఫిబ్రవరి 17న ‘రైతు కుటుంబం’కు 50 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు రైతు నేపథ్యగాథలు తెరకెక్కాయి. వాటిలో అనేకం విజయపథంలో పయనించాయి. ఏయన్నార్ నటించిన ‘రైతు కుటుంబం’ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. 1972 ఫిబ్రవరి 17న ‘రైతుకుటుంబం’ విడుదలైంది. ‘రైతు కుటుంబం’ టైటిల్ లోనే కథ తెలిసిపోతోంది. ఓ రైతు పెద్ద కొడుకు జోగయ్య ఇల్లు పట్టించుకోకుండా పేకాట ఆడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. జోగయ్య భార్య అన్నపూర్ణ తన కూతురుతో పాటు మరదులు…
(జూన్ 25తో ‘కళ్యాణమంటపం’కు 50 ఏళ్ళు) రీమేక్స్ రూపొందించడంలో కింగ్ అనిపించుకున్నారు దర్శకుడు వి.మధుసూదనరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ మంటపం’ చిత్రానికి కన్నడలో పుట్టన్న కణగల్ రూపొందించిన ‘గజ్జె పూజె’ ఆధారం. కన్నడలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో కాంచన పోషించారు. ఇందులో శోభన్ బాబు కాంచన ప్రియుని పాత్రలో నటించారు. 1971 జూన్ 25న విడుదలైన ‘కళ్యాణ మంటపం’ ఆ రోజుల్లో మంచి ఆదరణ పొందింది.దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ…