కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కామారెడ్డిలో టెన్షన్ మళ్ళీ మొదలైంది. నేడు హై కోర్టులో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై మరో సారి విచారణ జరగనుంది. ప్రభుత్వం కౌంటర్ కు సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ రామేశ్వర్ పల్లి ర�
కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి. సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించార�
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశం కానున్నారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరుకానున్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించారు. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు.
కామారెడ్డి జిల్లాలో నేడు మూడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటన పై ఉత్కంఠ కొనసాగుతుంది.
కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు. ఇవాళ బంద్‌కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.