Kamareddy Master Plan:కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి. సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ ప్రకటన పై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రైతులు. మాస్టర్ ప్లాన్ రద్దుకు కౌన్సిల్ తీర్మాణం చేయాలని కౌన్సిలర్లను కోరాలని, 11న మున్సిపాలిటీ ఎదుట రైతు జే.ఏ.సి. ధర్నా చేయాలని తీర్మానం చేశారు రైతులు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటనను వెల్లడించారు. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేయవద్దు, అద్దాలు ధ్వంసం, విధ్వంసం చేయవద్దని రైతు జే.ఏ.సి. హెచ్చరించింది.
Read also: Sreeleela: వామ్మో శ్రీలీల ఇంతమంది హీరోలతో సినిమాలు చేస్తోందా..!
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశమయ్యారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనపై పునరాలోచనలో పడ్డరైతులు.. భవిష్యత్ కార్యచరణ రైతు జే.ఏ.సి. ప్రకటించింది. రైతు జే.ఏ.సి. కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఉత్కంఠం నెలకొన్న నేపథ్యంలో.. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రేవు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రైతులు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటనను వెల్లడించడంతో ఉత్కంఠంగా మారింది.
Read also: Lakshmi Parvathi: ఆ పని చేస్తే.. తారక్ టీడీపీలోకి తప్పకుండా వస్తాడు
అయితే నిన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించినా.. ఫలితం లేకుండా పోయింది. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేసిన రైతులు వెనక్కి తగ్గడంలేదు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనని ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. ఈ నెల11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు కలెక్టర్. అవసరమైతే గడువు పెంచుతామన్నా.. మాస్టర్ ప్లాన్ పై ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని, రైతులు వస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నాని చెప్పిన రైతులు మాత్రం ఆందోళన ఉద్రిక్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. 13 నవంబర్ 22 నుండి 11 జనవరి 23లోపు అభ్యంతరాలు ఉంటే కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ కు తెలపాలని అందులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు కలెక్టర్. దీంతో అసంతృప్తితో వున్న రైతులు మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోవాలని, 11న ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించడం తీవ్ర ఉత్కంఠతకు దారితీస్తోంది. మరి దీనిపై కలెక్టర్ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తారా? ఎలా స్పందిస్తారు అన్నదానిపై చర్చ జరుగుతుంది.
Is it Good to Eat Leaves: ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలెన్నో