Kamareddy Collector: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించారు. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు కలెక్టర్. అవసరమైతే గడువు పెంచుతామన్నారు. ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ పై 1026 అభ్యంతరాలు వచ్చాయని, రైతులు వస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జోన్ అంటే భూములు తీసుకోవడం కాదని స్పష్టం చేశారు కలెక్టర్. మాస్టర్ ప్లాన్ మొదటి దశ లోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవని స్పష్టం చేశారు. కామారెడ్డి కి 61.5 స్కొయర్ కిలీమీటర్ లో ఉందని, ఎవరి భూములు తీసుకోవడం లేదని, అందరి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.. భూమి పోయింది అనడం అపద్దమన్నారు కలెక్టర్.
ఇంకా మార్పులు చేర్పులు అవుతాయని అన్నారు. అభ్యంతరాలు తెలియజేసిన వారికి పరిష్కారం, జవాబు తప్పకుండా ఇస్తామన్నారన్నారు. ఇంకా 60 రోజలు పూర్తి కాలేదని గుర్తు చేశారు కలెక్టర్ జితేష్ విపాటిల్. డ్రాఫ్ మాస్టర్ ప్లాన్ గురించి ఏమైనా అభ్యంతరాలు చెప్పడం జరిగిందని ప్రతి ఒక్కదానికి సీరియల్ నెంబర్ ప్రకారం రికార్డు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు కలెక్టర్. వారి సందేహాలకు జవాబు ఇస్తూనే మాస్టర్ ప్లాన్ ముందుకు పోతుందని తెలిపారు. ఎవరుకూడా అపోహలకు పోవద్దని, ప్రతి ఒక్కరికి జవాబు తప్పనిసరిగా ఇస్తామన్నారు కలెక్టర్. 6జనవరి 11కు 0 రోజులు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇది నేను కొత్తగా చెప్పడం కాదని.. ప్లెక్సీ ద్వారా ఈప్రతిపాదన రిలీజ్ చేయడం జరిగిందని మీడియా ముందు సాక్షాలతో సహా కలెక్టర్ బయటపెట్టారు. అందులో మాస్టర్ ప్లాన్ గ్రాఫ్ తో సహా.. ఆ ప్రతిపాదనలో స్పష్టంగా ఉందని తెలిపారు కలెక్టర్ మీడియా ముందు చదివి వినిపించారు. 13 నవంబర్ 22 నుండి 11 జనవరి 23లోపు అభ్యంతరాలు ఉంటే కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ కు తెలపాలని అందులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు కలెక్టర్.
అయితే గత మూడురోజులుగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో.. కలెక్టరేట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్, రైతన్న పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పలు నేతలు అరెస్ట్ కాగా.. రైతులకు గాయాలయ్యాయి. అయితే 20 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన రైతులు న్యాయం కోసం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు రైతుల రిట్ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చూస్తే కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకే అన్నట్టుగా ఉందని రైతులు వాపోతున్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీం కోర్ట్ తలుపు తట్టేందుకైనా సిద్ధమంటున్న రైతులు. హైకోర్టులో న్యాయం జరగపోతే.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే కలెక్టర్ స్పందించడం లేదని రైతులు, నేతలు ఆరోపించడంతో ఎట్టకేలకు కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇచ్చారు జనవరి 11 వరకు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని వారందరికి సమాధానం చెబుతామని క్లారిటీ ఇచ్చారు. మరి కలెక్టర్ ఇచ్చిన మీడియా సమావేశంతో రైతులు ఆందోళన విరమించి వారి అభిప్రాయాలను తెలిపుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.