కామాక్షి భాస్కర్ల వరుస చిత్రాలతో సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఆమె ఎంచుకునే కథలు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ “12A రైల్వే కాలనీ” షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన ఒక సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. అలాగే, బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ “పోలిమేర” మూడో భాగం షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. విభిన్న ప్రాజెక్టులతో…