కామాక్షి భాస్కర్ల వరుస చిత్రాలతో సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఆమె ఎంచుకునే కథలు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ “12A రైల్వే కాలనీ” షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన ఒక సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. అలాగే, బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ “పోలిమేర” మూడో భాగం షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. విభిన్న ప్రాజెక్టులతో కామాక్షి పూర్తిగా బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా కామాక్షి మాట్లాడుతూ, “ఈ మూడు సినిమాల్లో నేను పూర్తిగా భిన్నమైన పాత్రలను పోషిస్తున్నాను. ఈ ప్రాజెక్టులు నా సినీ ప్రస్థానంలో కీలక పాత్ర వహించనున్నాయి. ఒకేసారి మూడు చిత్రాలపై పని చేయడం సవాలుగా ఉన్నప్పటికీ, సినిమా పట్ల నాకున్న అభిమానం, ప్రేమ కారణంగా ఈ కష్టం కూడా ఆనందంగానే అనిపిస్తుంది. సినిమా సెట్స్‌పై ఉండటమంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు.
L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
“12A రైల్వే కాలనీ”, “పోలిమేర”, “సైతాన్” వంటి చిత్రాల్లో కామాక్షి తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్న విషయంపై ఆమె స్పందిస్తూ, “ఒక పాత్రతో కనెక్ట్ కావడం, ఆ క్యారెక్టర్‌కు నిజాయితీగా ఉండటం వల్లే ఒక నటుడు తనలోని కొత్త కోణాలను కనుగొనగలుగుతాడు. నేను ఎప్పుడూ సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటిస్తున్నాను. స్క్రిప్ట్ మరియు దర్శకుడి విజన్‌కు అనుగుణంగా పని చేస్తూ వస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే ఈ క్రెడిట్ ఇవ్వాలి. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణంలా భావిస్తాను” అని పేర్కొన్నారు.