నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మళ్లీ సన్నద్ధం అవుతుంటారు నాయకులు. కానీ... ఆ విషయంలో మర్చిపోయి.. నమ్ముకున్న క్యాడర్‌కు వెన్నుదన్నుగా ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని కూడా పట్టించుకోకుండా..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా అజయ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్టుల నిర్వహణపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన లేకుండా కొంతమంది పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తనదే రూపకల్పన అని, దీన్ని…
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో…
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున్ ఖర్గే తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అధ్వరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ.. ‘మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. తెలంగాణకు 5లక్షల 70వేల కోట్ల అప్పు మిగిల్చారు. ఒక్కొక్కరిపై 1లక్ష 40 వేల అప్పు మోపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి…
రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నా.. లేకున్నా కల్వకుర్తి మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదు.. భూ సమీకరణకు ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు అని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా (1.14 మరియు 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అవి రెండూ ఒకే కాంపోనెంట్ గా పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే KRMB కి లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ ను 25 టిఎంసీల నుండి 40 టిఎంసిల వరకు పెంచినదిగా చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.…
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో…