Kasireddy Narayan Reddy: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కసిరెడ్డి.. కండువా కప్పిన ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేరారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నాతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఇతర నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కాంగ్రెస్ లో చేరారు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నా.. లేకున్నా కల్వకుర్తి మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదు.. భూ సమీకరణకు ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు అని కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Nobel Peace Prize: ఇరాన్ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
పెద్ద మొత్తం కూడా కాదు.. ఎన్నో సార్లు అడిగాం అని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. భూములు పోయాయి, ఆ కాలువ ద్వారా నీళ్లు రాలేదు.. భూములు కోల్పోయిన రైతులకు రైతుబంధు రావడం లేదు.. నేను 10వ తరగతి చదువుకున్న స్కూల్లో జూనియర్ కాలేజీ నడుస్తోంది.. డిగ్రీ కాలేజీ లేదు.. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది అని ఆయన చెప్పారు. ఆ పార్టీలో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రాధాన్యత ఉంది.. నేను అక్కడ ఒక అసహాయ నేతగా మిగిలిపోయాను.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చింది అని కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని నేను నమ్ముతున్నాను అని కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.. నన్ను ప్రజలు తీసుకొచ్చారు.. గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉంది.. కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నా ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా పని చేస్తాను అంటూ ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!