Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ పర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరాన్ని బద్నాం చేయవద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం అంటూ వ్యాఖ్యనించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు.
Medigadda Barrage: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఉదయం కూలిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ఇవాళ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ గాంధీ పరిశీలించారు.
రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ అంబట్‌పల్లికి చేరుకోనున్నారు. అంబట్‌పల్లిలో ఉదయం 7.30 గంటలకు నూతన గ్రామపంచాయతీ సమీపంలో మహిళా సదస్సులో రాహుల్ పాల్గొననున్నారు.
Annaram Saraswati Barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో వాటర్ ఉబికి వస్తుంది.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్‌ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎం చెప్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివరాలు ట్విట్టర్లో పెట్టాలన్నారు.
మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం తీవ్రమయిన అంశమని ఆయన అన్నారు. క్వాలిటీ విషయంలో అనుమానాలు మొదలయ్యాయని ఆయన వెల్లడించారు.
Medigadda Barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడంతో కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ అధ్యక్షతన ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.