Bandi Sanjay : ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ ను మించి పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా…
Kadiyam Srihari : బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజ్లో సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు పూర్తి చేసింది. పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో పరీక్షలు పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఆదేశాలతో ప్యార్లల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. గతంలో రెండు సార్లు.. ప్రస్తుతం ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వ హించారు. బ్యారేజ్లో అప్, డౌన్ స్ట్రీమ్లలో 42 వెంట్లో…
హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు
Kadiyam Srihari : వరంగల్ జిల్లా మడికొండ సత్యసాయి గార్డెన్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యలు హజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 15సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబదిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి…
KCR : అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు…
Aadi Srinivas : హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారని, హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా? హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? అని ఆయన…
కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వర కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ క్రమంలోనే నేడు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన DEE -AEE లను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ విచారించించారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు... ఆ విషయం తెలుసు అన్నారు.