Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి…
Gangula Kamalakar : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సమర్థ్య విలువలను తెలుసుకున్నారు ఎమ్మెల్యే గంగుల. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మళ్ళా తాగునీటి సమస్య, నీటి యుద్ధం మొదలైందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి నెలలో ఇంత డెడ్ స్టోరేజీకి ఎప్పుడు వెళ్ళలేదని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే రాబోయే…
బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు.
CM Revanth Reddy : తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన విమర్శలను నిరసిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వారు 15 నిమిషాలుగా నిరసన తెలిపారు. సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, “స్టేచర్ గురించి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయి. గత ప్రభుత్వం…
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది.
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
Harish Rao : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు భారీగా డబ్బు వెచ్చించారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు రూ.90 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందజేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు…
Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా…
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ..ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టు ల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణ కు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్…
MLC Kavitha : తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో రాజకీయాలు చేయడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘నీళ్లు – నిజాలు’’ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశారని, మిగిలి ఉన్న…