Off The Record: మాటలు, చేతలతో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఆ మాజీ మంత్రికి ఇప్పుడు కేరాఫ్ కరవైందా? బత్తి ఆరిపోయి, ఫైర్ చల్లబడిపోయి… అస్సలు అంటుకోనంటోందా? అందుకే జిల్లాకు పూర్తిగా ముఖం చాటేశారా? నాకో నియోజకవర్గాన్ని చూపించండని మొత్తుకుంటున్నా… వైసీపీ అధిష్టాం లైట్ తీసుకుంటోందా? ఎవరా మాజీ మంత్రి? ఏంటా ఫైర్ ఆరిన స్టోరీ?
Read Also: Off The Record: కవిత సవాల్ తో బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుందా?
నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీద కొత్త సీన్స్ కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పుడు నా నియోజకవర్గం ఎక్కడని వెదుక్కుంటున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ సహా… అన్నిచోట్ల నో వేకెన్సీ బోర్డ్‌లే కనిపిస్తున్నాయట మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు. జైలు నుంచి విడుదలయ్యాక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పీడైపోవడం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీని యాక్టివేట్ చేసే పని మొదలుపెట్టడంతో… ఇక నేనేం చేయాలన్నట్టుగా అనిల్ పరిస్థితి ఉందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనసు తెలుసుకొని ప్రవర్తించే కాకాణికి జగన్ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారట.అందులో భాగంగానే ప్రతిపక్షంలోకి రాగానే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిన అనిల్‌కు PAC మెంబర్‌గా ఛాన్స్ ఇచ్చారు.
Read Also: Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచిదా? అసలు మ్యాటరేంటంటే..
ఈ క్రమంలో నెల్లూరు సిటీ బాధ్యతల్ని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి.. రూరల్ నియోజకవర్గ బాధ్యతలను.. అనిల్ సూచనలతో ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. PAC మెంబర్‌గా ఇవ్వడం ద్వారా అనిల్ సేవల్ని రాష్ట్ర స్థాయిలో వాడుకోబోతున్నారన్న చర్చ జరిగినా…అలాంటి వాతావరణం ఏదీ కనిపించకపోగా…ఇప్పుడు సొంత జిల్లాలోనే ఆయనకు స్థానం కరవైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జ్‌లు ఉండడంతో.. ఆయన రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని ఆవేదనగా ఉన్నారట అనుచరులు. అందుకే ప్రస్తుతం ఆయన జిల్లాకే ముఖం చాటేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీతో పాటు వెంకటగిరి మీద అనిల్‌కి ఆసక్తి ఉందట.
Read Also: Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య..
అయితే, అక్కడ ఉండే ఇన్చార్జిల పనితీరు పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో.. వచ్చే ఎన్నికల్లో వారినే అభ్యర్థులుగా ఖరారు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన తప్పిదాల వల్లే.. జిల్లాలో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని ఇప్పటికీ పార్టీ పాతతరం నేతలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈసారి అనిల్ కు జిల్లాలో నియోజకవర్గాన్ని కేటాయించొద్దని కొందరు కీలక నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే నెల్లూరు సిటీ బాధ్యతల్ని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించినట్టు చెప్పుకుంటున్నారు. ఏం చేయాలో పాలుపోకనే.. మాజీ మంత్రి ఇప్పుడు జిల్లాకు ముఖం చాటేస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అనిల్ తొలిసారి జిల్లా రాజకీయాలపై మాట్లాడారు. కాకాణి అరెస్ట్ తర్వాత స్థానిక నేతలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు.
Read Also: Bareilly violence: “ఐ లవ్ ముహమ్మద్” అల్లర్లకు ముందుగానే ప్లాన్..
కానీ, ఇప్పుుడు కాకాణి యాక్టివ్‌గా తిరుగుతూ ఉండడంతో..ఇక సొంత వ్యాపారాల మీదే దృష్టి పెట్టినట్టు సమాచారం. నెల్లూరు సిటీ, వెంకటగిరి మీద ఆసక్తి కనబరుస్తున్నా… వాటిలో దేన్నీ అప్పగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని, మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇస్తే….డిస్ట్రబెన్స్ మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్… అనిల్ కోసం ఆలోచిస్తారా? లేక ప్రస్తుతానికి అలా ఉండమని పక్కన పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.