Kakani Govardhan Reddy: అక్రమ మైనింగ్ కేసులో మరింత విచారణకు సంబంధించి మూడు రోజులపాటు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిమీ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చిన మూడు రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. ఈ కస్టడీ కాలవ్యవధిలో రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారుల సమక్షంలో ఆయనను విచారించారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆయనను…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో… వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టిందా? మైనింగ్ అక్రమాలపై సీఐడీ కాదు…. సీబీఐతో దర్యాప్తు చేయించమన్న డిమాండ్ వెనక వ్యూహం ఉందా? అధికార పార్టీ మీద పైచేయి సాధించేందుకు ప్రతిపక్షం ఓ పద్ధతిలో అడుగులేస్తోందా? ఇంతకీ వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి? అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్‌లను తలపించింది. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని… వెదికి…
చంద్రబాబు స్టార్ట్ చేశారు.. దాని పర్యవసానం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుందంటూ కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. నెల్లూరు సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు.. తప్పుడు…
కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు.. కాకాణిని వెంకటగిరి మేజిస్టేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చేనెల తొమ్మిది వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. దీంతో, వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి కాకాణిని తరలించారు పోలీసులు.
కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్…
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కాకాణిని జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక బలగాల మధ్య వెంకటగిరికి కోర్టుకు తీసుకొచ్చి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం బెంగళూరులో కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ…
గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరులోని డీటీసీకి పోలీసులు తీసుకొచ్చారు. రేపు వెంకటగిరి మేజిస్టేట్ ముందు కాకాణిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో గత ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ…
వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర గురించి అందరికీ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విమర్శించారు. అక్రమాలు చేయనప్పుడు ఎందుకు పరారయ్యారని, బయటకు వచ్చి తాను నిజాయితీ పరుడునని చెప్పుకోవచ్చు కదా? అని అన్నారు. కేసులకు భయపడే కాకాణి పరారయ్యారని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని ఎమ్మెల్సీ బీదా…