ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్కి �
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృథా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
చంద్రబాబు నాయుడుకి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చిందో గాని ప్రజలకు మేలు చేస్తే సహించలేడు అంటూ కైకలూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీ జోరు పెంచింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు.
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనస�
ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.. భారీ అభిమానులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ వేయడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు.