ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో వైసీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి భాస్కర్ రావు పేట, సంతోష్ పురం, అమరావతి, గురువాయుపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.. ప్రతి గడపగడపకు ప్రతి అక్క చెల్లెలు పలకరిస్తుంటే.. డీఎన్ఆర్ అన్న 12 రోజులే ఎలక్షన్ ఉంది ఎందుకు తిరుగుతున్నారు.. జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము కష్టపడతామని అంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు పెన్షన్ ఇస్తున్నారు, ప్రతి కుటుంబంలో మా బిడ్డలను చదివించడానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. వాలంటీర్లను తీసి వేయడం వల్ల పెన్షన్ తెచ్చుకునేందుకు ఈ రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని వారు చెబుతున్నారని కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: MLC Kavitha: కవితకు మరోసారి షాక్.. మళ్లీ వాయిదా పడ్డ బెయిల్ పిటిషన్..
చంద్రబాబు నాయుడుకి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చిందో గాని ప్రజలకు మేలు చేస్తే సహించలేడు అంటూ కైకలూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి కన్న బాగా చేస్తానని చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప అవ్వ తాతలకు వచ్చే పెన్షన్ రాజకీయం చేయటం సరికాదన్నారు. ప్రజల సొమ్ము పప్పు బెల్లాలు లాగా పంచి పెడుతున్నాడు అని వ్యాఖ్యనించిన ఈ ప్రతిపక్ష నాయకుడు.. ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ ఇస్తానని ప్రచారం చేస్తున్నారు.. జగన్ మోహన్ రెడ్డి చేస్తే తప్పు చంద్రబాబు చేస్తే ఒప్పు అయిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ స్థానిక ప్రతిపక్ష అభ్యర్థి నా పైన, నా కొడుకులపై బురద జల్లటానికి ఒక వీడియో రిలీజ్ చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించుకోవాలి తప్ప ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని దూలం నాగేశ్వరరావు అన్నారు.