Kadapa ZP Chairman: నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు మూడు మండల పరిషత్ వైస్ చైర్మన్ లు, ఒక ఉప సర్పంచ్ కు ఎన్నికలు నిర్వహించనున్నారు.. కడప జిల్లా పరిషత్తులు 50 మంది జడ్పీటీసీలలో 49 వైసీపీ, ఒకటి టిడిపి లెక్కించుకున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో కడప జిల్లా పరిషత్ కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైసీపీకి 38 మంది జడ్పిటిసి మద్దతు ఉండడంతో దాదాపు కడప జిల్లా పరిషత్ వైసీపీ కైవసం అయ్యే అవకాశం ఉంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు? స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం
అయితే, టీడీపీ తాము జడ్పీ చైర్మన్ రేస్ లో లేమని అధికారికంగా ప్రకటించింది. ఇక, బ్రహ్మంగారిమఠం మండలం జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ రేసులో లేకుంటే జెడ్పీటీసీ రామ గోవింద రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కావడం ఇక లాంచనమే. కాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల పరిషత్ లలో కూడా వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అక్కడ కూడా వైసీపీ నిర్ణయించిన అభ్యర్థులే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.. ప్రొద్దుటూరులో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగునున్నాయి.. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. అయితే, సింగిల్ నామినేషన్ దాఖలు అవుతాయా లేక పోటీ ఉంటుందా అనే దానిపై మాత్రం ఉత్కంఠత కొనసాగుతుంది.
ఇక, కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జెడ్పీటీసీలు అందరు క్యాంప్ లో ఉన్నారు. సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్నారు వైసీపీ జడ్పిటిసిలు.. గత నాలుగు రోజులుగా క్యాంపులో ఉన్నారు. జిల్లా పరిషత్తులో వైసీపీ సంపూర్ణ మెజార్టీ.. 50 మంది జెడ్పీటీసీలకు గాను వైసీపీలో 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. ఇక, టీడీపీ పోటీపై సందిగ్ధత కొనసాగుతుంది.