CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. శనివారం రోజు సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక, అదే రోజు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇవ్వబోతున్నారు.. మరోవైపు.. ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Jaipal Reddy: రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి
మరోవైపు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది.. ఇక, పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది.. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు.. గీతకార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. మరోవైపు.. కేబినెట్ భేటీ అనంతరం.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందంటున్నారు..