YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది.. విచారణ కీలక దశకు చేరుకుంది.. అయితే, ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి.. పొలిటికల్ ఎంట్రీపై ఓ పోస్టర్ కలకలం రేపుతోంది.. కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా వేసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి.. వైఎస్ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రే పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ…
Threatening calls: నెల్లూరు రాజకీయాల్లో కాకరేపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇప్పుడు బెదిరింపుల పర్వం మొదలైందట.. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. ఆరోపణలు చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల…
Road Accident: కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మరో 30 నిమిషాలలో ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకుంటామనగా ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయడపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీరు బంధువులతో కలిసి…
Recording Dances: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల అండతోనే ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో బ్రహ్మంగారిమఠం మండలంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. చెంచయ్యగారిపల్లెలో డీజే మాటున మహిళలతో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతుతో గతరాత్రి బహిరంగంగా రికార్డిండ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.…
Boy Missing in Forest: ఓ ఐదేళ్ల బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉండడమే కష్టం.. పడుకున్న సమయంలోనూ తన పక్కన ఎవరైనా ఉండేలా చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు పిల్లలు.. అయితే, అడవిలో దారితప్పిపోయి.. రాత్రి మొత్తం ఆ ఫారెస్ట్‌లోనే గడపాల్సిన పరిస్థితి వస్తే.. అయ్య బాబోయ్.. పెద్దవాళ్లకు వణుకుపుడుతోంది.. ఇక, ఆ చిన్నోడి పరిస్థితి ఏంటి? అసలే అటవీ ప్రాంతం.. క్రూరమృగాలు, విషసర్పాలు, చిన్న, పెద్ద జంతువులు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ బాలుడు సురక్షితంగా ఇంటికి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు.. ఇలా మూడు రోజులు బిజీ బిజీగా గడపనున్నారు…
DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు.…
చివరి నిమిషంలో తన కడప జిల్లా పర్యటనను రద్దుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పొగమంచు కారణంగా సీఎం జగన్ కడప పర్యటన మొదట ఆలస్యం అవుతుందనే సమాచారం వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరాల్సి ఉన్న ముఖ్యమంత్రి జగన్.. కడప విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు ఉండడంతో.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో వేచిచూశారు.. వాతావరణం అనుకూలిస్తే కడప బయల్దేరేందుకు సిద్ధంఅయ్యారు.. కానీ, ఎంతకీ…