Road Accident: కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మరో 30 నిమిషాలలో ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకుంటామనగా ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయడపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీరు బంధువులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనూష, ఓబుళమ్మ, రామలక్ష్మి మృతి చెందగా, గాయపడిన వారిని ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న లారీ చక్రానికి గాలి తక్కువగా ఉందని ఆపే క్రమంలో నిద్రమత్తులో ఉన్న డైవర్ ఆగివున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా , అనంతపురం, హైదరాబాద్‌లకు చెందిన బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో రామలక్ష్మి, ఓబులమ్మ అక్కచెల్లెళ్లు కాగా.. అనూష రామలక్ష్మి కుమార్తె. ప్రస్తుతం గాయపడిన ఏడుగురు ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?