చివరి నిమిషంలో తన కడప జిల్లా పర్యటనను రద్దుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పొగమంచు కారణంగా సీఎం జగన్ కడప పర్యటన మొదట ఆలస్యం అవుతుందనే సమాచారం వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరాల్సి ఉన్న ముఖ్యమంత్రి జగన్.. కడప విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు ఉండడంతో.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో వేచిచూశారు.. వాతావరణం అనుకూలిస్తే కడప బయల్దేరేందుకు సిద్ధంఅయ్యారు.. కానీ, ఎంతకీ క్లియరెన్స్ రాకపోవడంతో.. ఇవాళ్టి కడప పర్యటనను రద్దు చేసుకున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Rains Alert: ఏపీలో మూడు రోజుల భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ఆ తర్వాత.. ఉదయం 11.40 – మధ్యాహ్నం 12.10 వరకు కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొనాల్సి ఉంది.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా వెళ్లాల్సి ఉంది.. మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని మొదట షెడ్యూల్ ప్రకటించారు.. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో.. చివరి నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.