కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు.
కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని బి.జయ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు.. ఈ రోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 మంది రౌడీ షీటర్స్ ను గృహనిర్బంధం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా వ్యాప్తంగా 1,038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందు కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు.