నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..! ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం.…
ఈనెల 20న ఆదివారం నాడు కడప, విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు…
ఏపీలోని కడప జిల్లాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ వాటర్ అవార్డ్స్-2020లో భాగంగా మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కడప జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ఈ అవార్డులను ప్రకటించారు. దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా… ఏపీలోని కడప జిల్లాకు రెండో స్థానం దక్కింది. రాష్ట్రాల విభాగంలో ఉత్తరప్రదేశ్,…
కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా…
కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం నాడు పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో రూ.110 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులను చారిత్రాత్మక ఘటనగా సీఎం జగన్ అభివర్ణించారు. పులివెందులకు మంచి కంపెనీ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు 2వేల ఉద్యోగాలు లభిస్తాయని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు… ఇవాళ రెండో రోజు కడప జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించనున్న సీఎం.. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు.. ఇక, పులివెందులలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనున్నారు.. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది… నేడు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం… బొల్లవరంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.. బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మూడు రోజుల సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గన్నవరం…
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25వరకు మూడు రోజుల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరు , పులివెందులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మొదటి రోజు జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..(23.12.2021)ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.12.00 –…
ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు…