కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి…
రేపు వైఎస్సార్ 12వ వర్ధంతి ఉన్న నేపథ్యం లో ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే… లోటస్ పాండ్ నుంచి ఇడుపుల పాయ కి బయలు దేరారు వైఎస్ షర్మిల. ఇక రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ దగ్గర విజయమ్మ తో కలిసి నివాళులు అర్పించనున్నారు వైఎస్ షర్మిల. ఇక ఆ కార్యక్రమం అయ్యాక… రేపు మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు…
సిమ్లా పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్‌ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 02వ తేదీన ఉదయం 9.30 గంటలకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి…
వివేకానంద హత్య కేసు: మూడో రోజు సీబీఐ విచారణ నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ జరుగనుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో సీబీఐ అధికారుల బృందం విచారణ చేయనుంది. నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు మరికొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం కనిపిస్తోంది. నేడు నగరంలో ఉపముఖ్యమంత్రి అంజద్…
కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు… రిమ్స్ లో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 40 వేల వేతనం నుంచి 80 వేల కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విధులలో పాల్గొన్న డాక్టర్లకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటున్న డాక్టర్లు… న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించకపోతే విధులకు…
కడప జిల్లాలో రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు. నేడు జిల్లా వ్యాప్తంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 60379 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57935 గా ఉంది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 552 గా నమోదుకాగా కరోనా బారిన…