Son Kills Mother: మానసిక స్థితి సరిగా లేని కొడుకు చేతిలో కన్నతల్లిని దారుణ హత్య చేసిన ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డి దంపతులకు యశ్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. ఒక్కడే కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న దంపతులు యశ్వంత్ కుమార్ ను బీటెక్ వరకు చదివించారు. బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు యశ్వంత్ కుమార్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్..
MLA Putta Sudhakar: కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నందికొట్కూరు ఎమ్మెల్యే జై సూర్యలతో కలిసి అలగనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలో తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగే శక్తి ఉన్న ప్రాజెక్టు అలగనూరేనని పేర్కొన్నారు. 1985లో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రిజర్వాయర్‌కు మూడుకోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యాం నిర్మాణాన్ని ఆ రోజు…
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. కడప జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు కామాంధుడు. చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసి.. ఆ తర్వాత కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు దుండగుడు. శుక్రవారం నాడు నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి.. చంపి ముళ్లపొదల్లో వేసిన దారుణ ఘటన మైలవరంలోని కంబాలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.
వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు.
Kadapa: కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు.
తన సొంత జిల్లాలో మరోసారి పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు.
వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు.