కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి... కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా…
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులు ఇవ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని అయితే 300 రూపాయలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకా ఇవ్వాలంటూ ఆమెను హింసించాడని, డబ్బులు ఇవ్వడానికి జమీల నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు వారు పేర్కొన్నారు.
కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు.. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల అనే యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు రావడంతో వారిని చూసి కులయప్ప పరారయ్యారు.
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.