Kadapa Crime: తల్లితో సహజీవనం.. నిలదీసిన కొడుకు దారుణ హత్య..
- కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం
- తన తల్లితో సహజీవనం వద్దని వారినించిన యువకుడు
- దారుణంగా హత్య చేసి పరారమైన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Crime: తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని నిలదీసినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. గుట్టుగా పదేళ్లుగా సాగుతోన్న వ్యవహారం తప్పు అని మందలించినందుకు.. ఓ మహిళ కొడును హత్య చేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి.. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది..
Read Also: Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన సినీ కార్మికులు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు కు చెందిన నాగరత్నమ్మ.. రామచంద్రారెడ్డి ఇరువురు ఎన్నో సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, నాగరత్నమ్మకు తన మొదటి భర్తతో మహేశ్వర రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.. అతడి వయస్సు ఇప్పుడు ఇరవై ఐదేళ్లు.. నాగరత్నమ్మ భర్త నుంచి విడిపోయాక రామచంద్రా రెడ్డి పరిచయం అవ్వడంతో దాదాపు 10 సంవత్సరాలుగా నాగరత్నమ్మ, రామచంద్రా రెడ్డి సహజీవనం చేస్తున్నారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి తన తల్లి నాగరత్నమ్మ ను కలవకూడదు అని రామచంద్రా రెడ్డిని హెచ్చరిస్తూ వచ్చాడు మహేశ్వర రెడ్డి.. అయినా రామచంద్రారెడ్డి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా రామచంద్రా రెడ్డి, మహేశ్వర రెడ్డి మధ్య గొడవ జరిగినట్లు నాగ రత్నమ్మ తెలిపింది. తెల్లవారి చూసేసరికి తన కొడుకు రూమ్ నిండా, బెడ్ పైన రక్తపు మరకలు ఉండడంతో.. షాక్ తిన్న ఆమె.. ఏమైంది..? నా కొడుకు ఎక్కడ అని నిలదీసింది.. కానీ, రామచంద్రరెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు అని మృతుడు తల్లి నాగ రత్నమ్మ కన్నీరుపెట్టుకుంది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నాగరత్నమ్మ ఇంటిని పరిశీలించి డాగ్ స్వాడ్ ను రప్పించారు. రామచంద్రా రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..